లోకేష్‌ను కలిసిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

Jan 30,2024 16:30 #Adimulam, #Nara Lokesh

ప్రజాశక్తి- పిచ్చాటూరు : ఏపీ రాజకీయాల్లో నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం హైదరాబాదులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కలిశారు. టీడీపీలో చేరే అంశంపై ఆదిమూలం లోకేష్‌తో చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి ఆదిమూలం తన కుమారుడితో కలిసి వచ్చారు. కోనేటి ఆదిమూలంకు ఈసారి ఎమ్మెల్యే సీటు నిరాకరించిన వైసీపీ అధిష్ఠానం ఆయనకు తిరుపతి ఎంపీ టికెట్‌ ఇవ్వజూపింది. ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యే ఆదిమూలం మంత్రి పెద్దిరెడ్డి, ఆయన తనయుడు ఎంపీ మిథున్‌ రెడ్డిలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో వైసిపి రాష్ట్ర రాష్ట్ర హైకమాండ్‌ ఎమ్మెల్యే ఆదిమూలంపై చర్యలు తీసుకోనున్నట్టు ప్రచారం జరుగుతుండడంతో హఠాత్తుగా ఆదిమూలం తన తనయుడు సుమన్‌ కుమార్తో కలిసి లోకేష్‌ను కలిశారు. త్వరలో ఆయన చంద్రబాబునాయుడు సమక్షంలో టిడిపి చేరనున్నట్లు సమాచారం.

➡️