ఎంపీ పదవికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాజీనామా

Dec 13,2023 12:22 #Telangana

హైదరాబాద్ : బీఆర్ఎస్ నేత, మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇవాళ ఢిల్లీ వెళ్లిన కొత్త ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్‌లో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. ఈ మేరకు తన రాజీనామాను లేఖను స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు. 2019లో మెదక్ ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ విజయం సాధించారు. దీంతో ఆయన ఎమ్మెల్యే లేదా ఎంపీ.. రెండింట్లో ఏదో ఒక పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

➡️