ఎమ్మెల్యే లాస్య రోడ్డు ప్రమాద కేసు – టిప్పర్‌ డ్రైవర్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌ : కంటోన్మెంట్‌ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గత నెల 23వ తేదీ తెల్లవారుజామున పటాన్‌చెరు సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన లాస్య.. ఘటనా స్థలంలోనే మృతి చెందారు. అయితే, ఆమె ప్రయాణిస్తున్న కారు ముందుగా టిప్పర్‌ను ఢీకొని ఆ తర్వాత రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. తాజాగా, ఓఆర్‌ఆర్‌పై ఆమె వాహనాన్ని ఢీకొన్న టిప్పర్‌ను పటాన్‌చెరు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలిలో రికార్డయిన సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా ఆ టిప్పర్‌ను గుర్తించి, సీజ్‌ చేశారు. దానిని నడిపిన డ్రైవర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాస్య కారును ఆమె పీఏ ఆకాశ్‌.. నిద్రమత్తులో నడిపినట్టు తెలుస్తుంది. ముందుగా టిప్పర్‌.. కారును ఢకొీందా ? లేదా కారు టిప్పర్‌ను వెనక నుంచి ఢకొీట్టడం వల్ల ప్రమాదం జరిగిందా ? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. టిప్పర్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతుగా విచారిస్తున్నట్లు తెలుస్తుంది.

➡️