విశాఖలో అట్టహాసంగా మోడుకో అవార్డుల వేడుక

Feb 3,2024 10:25 #Awards, #Visakha
moduco awards in visakha

డిజైన్ & కన్‌స్ట్రక్షన్ రంగాలలో ప్రముఖులకు సత్కారం
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : నిర్మాణ పరిశ్రమలో అగ్రగామి వేదిక ఐనా మోడుకో డెవలప్‌మెంట్, డిజైన్ మరియు కన్‌స్ట్రక్షన్ రంగాలలో ప్రతిభ కనబర్చి, అత్యత్తమ విజయాలను సాధించిన వ్యక్తులకు మోడుకో అవార్డ్సులతో సత్కరించింది. శుక్రవారం విశాఖపట్నంలోని డీవీ గ్రాండ్ బే హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జివిఎంసి కమీషనర్ సాయికాంత్ వర్మ హాజరయ్యారు. మోడుకో మరియు అర్చిఫై ప్లాట్‌ఫారంపై హజరైన వ్యక్తుల పరిచయాలతో కార్యక్రమం ప్రారంభమైంది. పరిశ్రమ ప్రముఖులచే మాడ్యులర్ కన్‌స్ట్రక్షన్‌పై అంతర్దృష్టి ప్రెజెంటేషన్ జరిగింది. సాంప్రదాయిక నిర్మాణం మరియు భవిష్యత్తు యొక్క సవాళ్లు అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా ఈ కార్యక్రమం రసవత్తరంగా సాగింది. ఈ సందర్భంగా మోడుకో సేల్స్ డైరెక్టర్ ప్రజ్ఞా కృష్ణ ఈ కార్యక్రమం పట్ల తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ, “మోడుకో అవార్డ్స్ 2024లో నిర్మాణ పరిశ్రమలోని ప్రకాశవంతమైన ఆవిష్కర్తలను ఒకచోట చేర్చడం మాకు చాలా ఆనందంగా ఉందని . అన్నారు. ఈ కార్యక్రమ వేడుకలకు హాజరైన వారికి నెట్‌వర్కింగ్ సహకారం కోసం అదనపు అవకాశాలను అందిస్తుందని అన్నారు.
అవార్డు గ్రహీతలు
స్టైల్ ప్లస్ స్ట్రక్చర్ – ఆర్. శ్రీనివాస్, ప్రాజెక్ట్ ఇంక్-ఆర్.ఆదిత్య, వైశాఖ్- రామకృష్ణ, జిఈవి -వెంకట్ వీరమాచనేని, ఆర్ఏంసి అల్ట్రాటెక్ విశాఖ – బాబ్జీ, క్యూబ్ 6 – రాజేష్ అగర్వాల్, ఆగస్ట్ ఇన్‌ఫ్రా, పి.హరీష్, నవరత్న ఎస్టేట్స్- సురేష్ జైన్, అలయన్స్ స్పేసెస్-అభిషేక్ దత్తా, హను రెడ్డి రియల్టీ- డేనియల్ సుషేంధర్.

➡️