మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు

Apr 27,2024 10:14 #summer special trains

ప్రజాశక్తి – విశాఖపట్నం : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీకాకుళం రోడ్డు – తిరుపతి, కొచ్చువేలి – బరౌని – కొచ్చువేలి మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు 07440 తిరుపతి – శ్రీకాకుళం రోడ్‌ స్పెషల్‌ మే 5, 12 తేదీల్లో రాత్రి 20.05 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.05 గంటలకు దువ్వాడ చేరుకుని మరలా 08.10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు శ్రీకాకుళం రోడ్డుకు చేరుకుంటుంది. 07441 శ్రీకాకుళం రోడ్డు -తిరుపతి ప్రత్యేక రైలు మే 06, 13 తేదీలలో మధ్యాహ్నం 15.00 గంటలకు శ్రీకాకుళం రోడ్‌లో బయలుదేరి సాయంత్రం 18:38 గంటలకు దువ్వాడ చేరుకుని 18.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.20 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైళ్లు తిరుపతి, శ్రీకాకుళం రోడ్‌ స్టేషన్ల మధ్య రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి మీదుగా ప్రయాణిస్తాయి. 06091 కొచ్చువేలి నుంచి బరౌని సమ్మర్‌ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ మే 04 నుంచి జూన్‌ 29 వరకు ప్రతి శనివారం అర్ధరాత్రి 01.30 గంటలకు కొచ్చువేలిలో బయలుదేరి మరుసటి రోజు ఆదివారం ఉదయం 10.48 గంటలకు దువ్వాడ చేరుకుని మరలా 10.50 గంటలకు బయలుదేరి సోమవారం 13.55 గంటలకు బరౌని చేరుకుంటుంది. 06082 బరౌని – కొచ్చువేలి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ బరౌనిలో మే 7 నుండి జూలై 2 వరకు ప్రతి మంగళవారం మధ్యాహ్నం 15.30 గంటలకు బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు ఉదయం 04.18 గంటలకు దువ్వాడ చేరుకుని మరలా 04.20 గంటలకు బయలుదేరి గురువారం ఉదయం 9:55 గంటలకు బరౌని చేరుకుంటుంది. ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేలోని వాల్తేరు డివిజన్‌ పరిధిలో దువ్వాడ, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ మీదుగా ప్రయాణిస్తాయి.

➡️