పురుగుల మందు తాగి తల్లీకూతురు ఆత్మహత్య

May 22,2024 23:23 #hyderabad, #Suicide

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో :ఆర్థిక ఇబ్బందులు.. భూ తగాదాలు ఓ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. పురుగుల మందు తాగి తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌ జోగులాంబ గద్వాల జిల్లా మానపాడు మండలం పరిధిలోని బూడిదపాడు గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బూడిదపాడు గ్రామానికి చెందిన నర్సింహులు అన్నదమ్ముల మధ్య చాలా కాలంగా భూ తగాదాలు ఉన్నాయి. గొడవలతో విసిగిపోయిన నర్సింహులు భార్య వరలకిë, కుమార్తె అనురాధ మంగళవారం సాయంత్రం పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకెళ్లారు. కుటుంబీకులు వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించేలోపే ఇద్దరూ మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. అయితే, కూతురు, కొడుకు చదువు కోసం, పెండ్లి కోసం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని, వారసత్వంగా వచ్చిన భూములు సీలింగ్‌లో ఉండటంతో ఎవరూ కొనేందుకు ముందుకు రావడం లేదని అన్నదమ్ములకు విజ్ఞప్తి చేశారు. అయినా వివాదం సమసిపోలేదు. దాంతో తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు తెలిపారు.

➡️