గుండెపోటుతో తల్లి మృతి.. 5 రోజులుగా మృతదేహంతో ఇంట్లోనే కొడుకు..

Jan 7,2024 11:55 #death, #visaka

ప్రజాశక్తి-విశాఖ : విశాఖలో దారుణం వెలుగుచూసింది. తల్లి గుండెపోటుతో మృతి చెందగా.. మృతదేహంతో కొడుకు 5 రోజుల పాటు ఇంట్లోనే ఉన్నాడు. దుర్వాసన రావడంతో స్థానికులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా.. అసలు విషయం బయటపడింది. ఈ ఘటన పెదవాల్తేరు కుప్పం టవర్స్‌లో చోటుచేసుకుంది. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. త్రీటౌన్‌ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలిచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా శ్యామల కుమారుడు మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు స్థానికులు తెలిపారు.

➡️