రాష్ట్ర ప్రజలకు ముద్రగడ బహిరంగ లేఖ 

Mar 11,2024 12:03 #join ycp, #letter, #Mudragada

14వ తేదిన జరిగే పాల్గొనాలని పిలుపు
ప్రజాశక్తి – కిర్లంపూడి : మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. సోమవారం కాకినాడలోని కిర్లంపూడిలోని ఆయన నివాసంలో విలేఖరులకు లేఖను అందజేశారు. ”గౌరవ ప్రజానీకానికి మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారములంటూ..” మొదలు పెట్టి ఈ మద్య జరిగిన రాజకీయ పరిణామాలు మీ అందరికి మీడియా ద్వారా తెలుసని అనుకుంటున్నానంటు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహనరెడ్డి పిలుపు మేరకు వై.యస్.ఆర్.సి.పి లోకి వెళ్ళాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టడానికి ఎటువంటి కోరికలు లేకుండా వారి విజయానికి మీ సహకారంతో పనిచేయాలని నిర్ణయించుకున్నానంటు, వారి ద్వారా పేదవారికి మరెన్నో సంక్షేమ పధకాలతోపాటు, వీలైనంత అభివృద్ధిని వారితో చేయించాలని ఆశతో ఉన్నానని లేఖలో వివరించారు. ”మీ బిడ్డను అయిన నేను ఎప్పుడూ తప్పు చేయలేదని, చేయనని” పేర్కొన్నారు. ’14వ తేదిన వై.యస్.ఆర్.సి.పి లోకి చేరుటకు ఉదయం 8 గంటలకు కిర్లంపూడి నుండి తాడేపల్లికి ప్రయాణం అవుతున్నానని, మీ అవకాశాన్ని బట్టి నా ప్రయాణంలో మీరు కూడా పాలుపంచుకోవడానికి రావాలని ప్రార్ధిస్తున్నానంటు’ తెలిపారు.

‘చిన్న మనవి.. క్షమించండి ఈ ప్రయాణంలో మీకు కావలసిన ఆహారం, ఇతర అవసరాలు మీ వాహనంలోనే తెచ్చుకోమని కోరుకుంటున్నానని తెలిపారు. కిర్లంపూడి నుండి ప్రారంభమై ప్రత్తిపాడు మీదుగా జగ్గంపేట, ఏలూరు, లాలా చెరువు, వేమగిరి, రావులపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం , విజయవాడ మీదుగా తాడేపల్లి చేరుకుంటుందని లేఖలో వివరించారు.

➡️