కొడుకు మృతికి కోడలే కారణం!

murder in anakapalli
  • మృతుని తల్లి పోలీసులకు ఫిర్యాదు

ప్రజాశక్తి – కశింకోట (అనకాపల్లి జిల్లా) :  కొడుకు మృతికి కోడలే కారణమని తల్లి వెంకయ్యమ్మ పోలీసులకు శనివారం  ఫిర్యాదు చేసింది. పోలీసు వారు చెప్పిన  వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యారం ఎస్సీ కాలనీకి చెందిన బరుకు గోవింద ( 43) శుక్రవారం రాత్రి అనుమానస్పథ స్థితిలో చనిపోయాడు. శనివారం ఉదయం అతడు చనిపోయినట్టు తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు డిఎస్పి సుబ్బరాజు  సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. క్లూస్ టీం, డాగ్స్ స్క్వాడ్ ను రప్పించి ఘటన స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల నుండి వివరాలు సేకరించారు. తన కొడుకు మరణం సహజమైనది కాదని, అతని మృతికి తన కోడలు శివలక్ష్మి కారణమని వెంకయమ్మ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృత దేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం వందపడకల ఆసుపత్రికి తరలించారు. సిఐ వినోద్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు మృతుడి భార్య శివలక్ష్మిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

➡️