‘నల్లారి’కి ఊరట

ప్రజాశక్తి-అమరావతి : రాజంపేట బిజెపి ఎంపి అభ్యర్థి, మాజీ సిఎం నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి ఎపి హైకోర్టులో ఊరట లభించింది. చిత్తూరు జిల్లా, రొంపిచర్ల పోలీసులు ఏప్రిల్‌ నెలలో నమోదు చేసిన కేసుల్లో తదుపరి చర్యలను నిలిపివేస్తూ జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఆదేశాలిచ్చారు. అధికారుల అనుమతి లేకుండా ఈ నెల 7న రొంపిచర్ల బస్టాండ్‌లో కిరణ్‌ కుమార్‌రెడ్డి సమావేశం నిర్వహించారని ఎంపిడిఒ రెడ్డప్ప ఆచార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రొంపిచర్ల పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. నిర్ణయించిన సమయం కంటే ముందుగానే సమావేశాన్ని ముగించారని న్యాయవాది ఎన్‌పి సుమంత్‌ చెప్పారు. తదుపరి విచారణను హైకోర్టు జూన్‌ నెలకు వాయిదా వేసింది.

➡️