నరసాపురం ఎంపి సీటు నాదే – ఎంపి రఘురామకృష్ణంరాజు

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ :టిడిపి, జనసేన, బిజెపి కూటమి తరపున నరసాపురం ఎంపి అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని, త్వరలోనే దీనిపై ప్రకటన వస్తుందని నరసాపురం ఎంపి కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం విచ్చేసిన ఆయన తన నివాసంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కూటమి అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై ఈ ప్రాంత ప్రజలు విస్మయానికి గురయ్యారన్నారు. త్వరలోనే తన పేరు కూటమి నేతలు ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎవరికీ భయపడలేదని, తన ఒక్కడికే భయపడ్డారని అన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలోని తన స్నేహితులను కలుస్తున్నానని, టికెట్‌ వచ్చిన వెంటనే ప్రచారంలో ఉంటానని తెలిపారు. తనకు సీటు రాకుండా జగన్‌ అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారని ఆరోపించారు.

➡️