జనసేన పాలకొండ అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాలకొండ నియోజకవర్గ అభ్యర్థిని జనసేన ప్రకటించింది. టిడిపి నుంచి ఇటీవల పార్టీలో చేరిన నిమ్మక జయకృష్ణను అభ్యర్థిగా వెల్లడించింది. ఈ మేరకు జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నియోజకవర్గం నుంచి టికెట్‌ కోసం ఆశావహులు ఎక్కువగా ఉండటంతో పలు దఫాలుగా జనసేన పక్షాన సర్వేలు జరిగాయని, ఇందులో జయకృష్ణకు అత్యధికంగా ప్రజల మద్దతు లభించిందని తెలిపారు. పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ ఆయనను అభ్యర్థిగా ఖరారు చేశారని పేర్కొన్నారు.

➡️