అభివృద్ధిపై స్పష్టమైన వైఖరి లేదు : పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు

Feb 6,2024 09:42 #amaravati, #PDF MLCs
pdf mlcs on ap budget
  • ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి

 ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గవర్నరు ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన వైఖరి లోపించిందని పిడిఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. గవర్నరు ప్రసంగంపై పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన మీడియా పాయింట్లో మాట్లా డారు. డైరెక్టు బెనిఫిట్‌ స్కీం (డిబిటి)ల గురించి మాత్రమే గవర్నరు ప్రసంగంలో వివరించారన్నారు. మొదటి పది పేజీల గవర్నరు ప్రసంగంలో విద్యారంగంలో మార్పులు తెచ్చామని చెప్పారని, విద్యారంగంలో ముఖ్యపాత్ర వహించే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ గురించి ప్రస్తావించలేదన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డిఎస్‌సి నిర్వహించలేదని అన్నారు. ఇప్పుడు ఇస్తామన్న డిఎస్‌సిలోనూ 6,100 పోస్టులు భర్తీ చేస్తామని చెబుతున్నా రన్నారు. 9 జిల్లాల్లో ఎస్‌జిటి పోస్టులు జిరోగా చూపించారన్నారు. 20 వేలకు పైగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను డిఎస్‌సి ద్వారా భర్తీ చేయాలని, ఇతర శాఖల్లోని గ్రూప్‌-1, 2 పోస్టులను పెద్ద సంఖ్యలో భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు కేటాయింపులను పెంచి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. కౌలు రైతులకు న్యాయం చేయాలన్నారు.

➡️