డ్రగ్స్‌ ముఠాలను సహించేది లేదు : హైదరాబాద్‌ నూతన సీపీ హెచ్చరిక

తెలంగాణ : డ్రగ్స్‌ ముఠాలను సహించేది లేదని.. వారిని ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్‌ నూతన సీపీగా బుధవారం శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు.తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో విధులు నిర్వహించడం సవాళ్లతో కూడుకున్నదని అన్నారు. డ్రగ్స్‌ మహమ్మారిని కూకటివేళ్లతో పెకిలించాలని చెప్పారు. సినీ పరిశ్రమలో డ్రగ్స్‌ మూలాలుంటే సహించేది లేదని హెచ్చరించారు. దీనిపై సినీ రంగానికి చెందిన పెద్దలతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. చట్టాన్ని గౌరవించే వారితో ఫ్రెండ్లీ పోలీసింగ్‌.. ఉల్లంఘించే వారితో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. అధికారులు, సిబ్బంది సహకారంతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తానన్నారు. ప్రజలకు వేగంగా సేవలు అందించేందుకు కఅషి చేస్తామని సీపీ అన్నారు.

➡️