రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. అతి వేగమే ప్రధాన కారణం

Dec 22,2023 15:10 #rayadurgam, #road accident

హైదరాబాద్‌ : రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు గచ్చిబౌలి కేర్‌ హాస్పిటల్‌ సమీపంలో అదుపు తప్పి డివైడర్‌ను డీ కొట్టడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. దాంతో.. గాయపడ్డవారిని పోలీసులు దవాఖానకు తరలించారు. కారులో ఐదుగురు యువకులు ప్రయాణిస్తుండగా శివరామకఅష్ణ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

➡️