ప్రజాశక్తి ఫిర్యాదుపై కొనసాగుతున్న సిఐడి విచారణ

Apr 3,2024 11:08 #cid enquiry

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : విశాఖలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న సమయంలో ప్రజాశక్తి అమరావతి బ్యూరో పేరుతో తప్పుడు కథనాన్ని తయారు చేసి సోషల్‌ మీడియాలో ప్రచారం చేసిన విషయంపై సిఐడి విచారణ కొనసాగుతోంది. డిఎస్‌పి స్థాయి అధికారి దీని విచారణ బాధ్యతలు చూస్తున్నారు. గత నెల 22న వచ్చిన ఈ ఫేక్‌ కథనంపై సిఐడికి, సైబర్‌క్రైం అధికారులకు ప్రజాశక్తి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన వి సురేష్‌ నుంచి సిఐడి అధికారులు ఇప్పటికే స్టేట్‌మెంటు తీసుకున్నారు.

➡️