టిడిపి అధ్యక్షులుగా పల్లా బాధ్యతల స్వీకరణ

  • ప్రభుత్వానికి పార్టీకి మధ్య వారధి మీరే.. : చంద్రబాబు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ప్రభుత్వానికి పార్టీకి మధ్య వారధి మీరేనని, సీనియర్ల సూచనలు, జూనియర్ల మద్దతుతో పార్టీలో యువ రక్తాన్ని చేర్చాలని పల్లా శ్రీనివాస రావుకు సిఎం చంద్రబాబు సూచించారు. ప్రతిపక్షంలో గత ఐదేళ్లుగా పడిన కష్టం, పార్టీ బలోపేతం కోసం చేసిన కృషిని గుర్తించి అతి పెద్ద బాధ్యత అప్పగించామన్నారు. ఉండవల్లి లోని సిఎం నివాసంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్‌కు పల్లా శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పల్లాకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. ప్రతి కార్యకర్తనూ దగ్గరకు తీసుకోవాలని, బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ తరగతుల నుంచి యువతను రాజకీయాల్లోకి స్వాగతించాల న్నారు. జులై నుంచి పార్టీ మెంబర్‌ షిప్‌ డ్రైవ్‌ కూడా పున:ప్రారంభించాలని సూచించారు.

➡️