రాజీవ్‌ గాంధీ సేవలు ఎనలేనివి -పళ్లంరాజు నివాళి

May 21,2024 21:36 #Pallam Raja, #Rajiv Gandhi', #tribute

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ దేశానికి ఎనలేని సేవలు అందించారనికేంద్ర మాజీ మంత్రి ఎమ్‌ఎమ్‌ పళ్లంరాజు నివాళులర్పించారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం విజయవాడలోని ఆంధ్రరత్నభవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ సైన్స్‌, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి కోసం రాజీవ్‌ గాధీ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ, వి.గురునాధం, పి.వై.కిరణ్‌, షేక్‌నాగూర్‌, విజయవాడ కాంగ్రెస్‌ అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు, తదదితరులు పాల్గని రాజీవ్‌గాంధీకి నివాళులర్పించారు.

➡️