చంచల్‌ గూడా జైలుకు పల్లవి ప్రశాంత్‌..14 రోజుల రిమాండ్‌

Dec 22,2023 11:19 #bigg boss, #police

హైదరాబాద్‌ : ప్రముఖ రియాల్టీ షో బిగ్బాస్‌ సీజన్‌-7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ సహా అతని సోదరుడు మహావీర్‌ను అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరికి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. షోలో విజేతగా నిలిచిన అనంతరం బయట హంగామా చేయడం, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం, పోలీసుల అదేశాలు బేఖాతరు చేయడంపై జూబ్లీహిల్స్‌ పోలీసులు మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు. బుధవారం రోజున గజ్వేల్‌ మండలం కొల్గూర్లో పల్లవి ప్రశాంత్‌ను అరెస్టు చేశారు. అతనితో పాటుగా కేసులో ఏ2గా ఉన్న అతని సోదరుడిని సైతం అరెస్ట్‌ చేసి నగరానికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. విచారణ జరిపిన కోర్టు ఇద్దరికి 14రోజుల రిమాండ్‌ విధించింది. ఇద్దరిని జూబ్లీ హిల్స్‌ పోలీసులు చంచల్‌ గూడా జైలుకి తరలించారు. ఈ కేసులో మరి నిందితుడు వినోద్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాడిలో పాల్గొన్న మరో 14మంది యువకులను సైతం పోలీసులు విచారిస్తున్నారు.

➡️