యువగళం సభ కోసం విశాఖ చేరుకున్న పవన్ కల్యాణ్

Dec 20,2023 15:53 #JanaSena, #pavan kalyan, #visakhapatnam

ప్రజాశక్తి-విశాఖ : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర డిసెంబరు 18న ముగిసింది. ఈ నేపథ్యంలో, నేడు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లి వద్ద యువగళం విజయోత్సవ సభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ సభ కోసం ఇప్పటికే చంద్రబాబు, బాలకృష్ణ చేరుకున్నారు. తాజాగా, యువగళం సభలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా విశాఖ చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో ఆయనకు జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికారు.

➡️