భూసేకరణ నోటిఫికేషన్‌ రద్దుపై పిల్‌

Apr 30,2024 21:16 #amaravathi, #AP High Court, #rajadani

ప్రజాశక్తి-అమరావతి : రాజధాని అమరావతి ప్రాంతంలో భూసేకరణ ప్రకటనను గుంటూరు కలెక్టరు ఉపసంహరిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. రాజధాని అంశంపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పునకు విరుద్ధంగా నోటిఫికేషన్‌ ఉందంటూ రాజధాని రైతులు దాఖలు చేసిన పిల్‌లో పేర్కొన్నారు. రాజధాని అమరావతిని ధ్వంసం చేయాలనే కుట్ర ఉందని, తక్షణమే హైకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. ఇందులో పలువురు అధికారులతోపాటు సిఎం వైఎస్‌ జగన్‌ను వ్యక్తిగత ప్రతివాదులుగా పేర్కొన్నారు.

➡️