దడ పుట్టిస్తున్న పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు

May 10,2024 14:24 #Postal Ballot Votes

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జిల్లాలో గత ఐదు రోజులుగా జరిగిన ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో దడ పుట్టిస్తున్నాయి. జిల్లాలో ఎప్పుడు ఏ ఎన్నికలకు లేని విధంగా పోస్టల్‌ బ్యాలెట్‌ అధికంగా నమోదు చేయడం ఒకటైతే నమోదు అయినా ఓట్లు కంటే అధికంగా ఓట్లు పడటంతో ప్రధాన పార్టీలు మద్య దడ పుట్టిస్తున్నాయి. జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో 12 వేలకు పైగా ఓట్లు నమోదు చేసికోవడం జరిగింది. అయితే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు అందరికీ ఓట్లు నమోదు చేసుకోకపోయిన ఓటు వేసే అవకాశం కల్పించడంతో ఓట్లు అధికంగా 16 వేలు మంది దాటి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది.దీంతో ఈ ఓట్లు ఎవరికి నష్టం కలిగిస్తాయనే చర్చ జరుగుతుంది. మరో వైపు ఉద్యోగుల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఇన్ని ఓట్లు నమోదు కావడం కారణంగా చర్చ జరుగుతుంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఎక్కువుగా అధికార వైసిపి కి నష్టం జరుగుతుందనీ,ప్రతిపక్ష పార్టీలకు మేలు జరుగుతుందనే చర్చ జోరుగా సాగుతుంది. జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో నమోదు అయిన పోస్టల్‌ బ్యాలెట్‌ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
…..
నమోదు కంటే ఎక్కువగా నమోదు అయిన ఓట్లు…
విజయనగరం ఉమ్మడి జిల్లా చరిత్రలో ఏడు నియోజకవర్గాల్లో నమోదు చేసుకున్న ఓట్లు కంటే అధికంగా ఓట్లు నమోదు కావడం విశేషం. విజయనగరం జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో 14195 ఓట్లు నమోదు చేసుకోవడం జరిగింది. విజయనగరం నియోజకవర్గంలో 3975 మంది, బబ్బిలి 2105, ఎస్‌ కోట 1776, నెల్లిమర్ల 1525, గజపతినగరం 1665,రాజాం 1741,చీపురుపల్లి 1405 మంది ఓట్లు నమోదు చేసుకోవడం జరిగింది. ఈ నెల 5 తేది నుంచి 9 తేది వరకు ఏడు నియోజకవర్గాల్లో జరిగిన ఓట్లు నమోదు విజయనగరం లో 4212, బబ్బిలిలో 2433, ఎస్‌ కోట 2012, నెల్లిమర్ల 1760, గజపతినగరం 2040,రాజాం 2215, చీపురుపల్లి 1497 ఓట్లు నమోదు కావడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా లో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో పాలకొండ 1809 కి 2009, పార్వతీపురం 2194 కి 2273 ,కురుపాం 2494 కి,2633, సాలూరు 1446 కి 1512 ఓట్లు నమోదు కావడం జరిగింది. మొదటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లు నమోదు చేసుకున్న వారికి ఓట్లు లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.దీంతో ఎన్నికల కమీషన్‌ ఎన్నికల విధులకు సంబంధించిన ఆర్థర్‌ కాపీ అండి,ఆ నియోజకవర్గంలో ఓటు ఉన్న ప్రతి ఉద్యోగికి ఇటు వేసుకునే అవకాశం కల్పించడంతో ఉద్యోగులు ఓట్లు పెరుగుదలకు కారణం.

➡️