లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోడీ

ప్రజాశక్తి-పెనుకొండ: శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటిస్తున్నారు. ఢిల్లీ నుంచి పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం లేపాక్షి ఆలయానికి వెళ్లారు. అక్కడ వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను అర్చకులు ప్రధానికి వివరించారు. గోరంట్ల మండల పరిధిలోని పాలసముద్రం వద్ద రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ (నాసిన్‌) ఏర్పాటవుతోంది. కాసేపట్లో ఈ శిక్షణ కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు.

➡️