ఖైదీకి కొవిడ్‌ పాజిటివ్‌.. ఏపీలో పెరుగుతున్న కేసులు

Jan 1,2024 08:20 #AP, #Covid Cases

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా విజఅంభిస్తున్న వేరియంట్‌ కొవిడ్‌ కేసులతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందుస్తు చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఏపీలో 90కి పైగా కేసులు నమోదు అయ్యాయి.రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న కాకినాడ ప్రాంతానికి చెందిన 67 ఏండ్ల వఅద్ధుడికి కొవిడ్‌ పాజిటివ్‌ సోకింది. ఈనెల 17న జలుబు, జ్వరం, దగ్గుతో బాధపడుతుండడంతో అతడిని జైలు ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించారు. 19న జ్వరం ఎక్కువ కావడంతో జీజీహెచ్‌కు తరలించి ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించి ల్యాబ్‌కు పంపారు. అక్కడి నుంచి వచ్చిన ఫలితాల్లో కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో ఆసుపత్రి ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని వైదులు తెలిపారు.రెండు రోజుల క్రితం శ్రీసత్యసాయి జిల్లాలో 87 సంవత్సరాల వృద్ధుడు ఓపెన్‌ హార్ట్‌ సర్జరి జరిగింది. అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొవిడ్‌ బారిన పడి మరణించిన మొదటి కేసుగా ఏపీ వైద్య రికార్డులో నమోదయ్యింది.

➡️