రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు టీచర్ మృతి

private teacher died in road accident

ప్రజాశక్తి-కసింకోట : అనకాపల్లి జిల్లా కసింకోట జాతి రహదారి ఆర్క్ టౌన్షిప్ వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం శిరీష జ్యోతి(26) అక్కడికక్కడ మృతి చెందింది. పోలీసుల సంబంధించిన వివరాలు ప్రకారం కూడ్రము గ్రామానికి చెందిన శిరీష జ్యోతి కసింకోట ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. రోజు మాదిరిగా మరో మహిళను ఎక్కించుకొని తన స్కూటీపై వస్తుండగా వెనక నుండి స్కూటీనీ అనకాపల్లి వైపు నుండి ఏలమంచిలి వైపు వెళుతున్న లారీ ఢీకుంది. శిరీష జ్యోతి తలకు తీవ్రంగా గాయపడి మృతి చెందింది. స్కూటిపై కూర్చున్న ప్రైవేటు ఉపాధ్యాయులు భాగ్యశ్రీ కాలు విరిగిపోవడంతో 108 వాహనంలో చికిత్స కోసం అనకాపల్లి తరలించారు. సంఘటన స్థలాన్ని అనకాపల్లి రూరల్ సీఐ రవికుమార్ పరిశీలించారు. కేసును కశింకోట ఆదనపు ఎస్ఐ జే నాగేశ్వరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️