ఎంపీలు సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ నిరసన

protest against mps suspention vja

ప్రజాశక్తి-యంత్రాంగం :  పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 141 మంది ప్రతిపక్ష ఎంపీలను నిరంకుశంగా సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ ”ఇండియా” వేదిక పిలుపు మేరకు సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, లిబరేషన్, విసికె పార్టీల ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో నిరసనలు తెలిపారు.

ప్రకాశం జిల్లా ఒంగోలులో రాజకీయ పార్టీల నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్ మాట్లాడుతూ పార్లమెంటుపై బిజెపికి ఏ మాత్రం గౌరవం లేదని తెలిపారు. ఎంపీలు సస్పెన్షన్ అప్రజ్యాస్వామికమని అన్నారు.  సస్పెన్షన్ చేసి బిల్లులను ఆమోదించుకోవడం సరైంది కాదని అన్నారు.

protest against mps suspention vspk

విశాఖలో….

protest against mps suspention vja

విజయవాడలో

protest against mps suspention bapatla

బాపట్లలో వామపక్షాలు నిరసన

protest against mps suspention tpt

తిరుపతి జిల్లా కాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద 141 మంది ఎంపీలు సస్పెండ్ చేయడానికి వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం -పార్టీల ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బత్తయ్య నాయుడు సీపీఐ జిల్లా కార్యదర్శి పి మురళి సిపిఎం పార్టీ నియోజకవర్గ కార్యదర్శి పుల్లయ్య లు మాట్లాడుతూ పార్లమెంటును రక్షించలేని పాలకులు ప్రజలనెలా రక్షిస్తారని ఆరోపించారు సీపీఐ తిరుపతి జిల్లా కార్యదర్శి పీ మురళి ధ్వజమెత్తారు.బ్రిటీష్ పాలకులకు మించిన నిరంకుశ పాలన దేశంలో కొనసాగుతోందన్నారు.

 

 

 

➡️