టిడ్కో గృహాల వద్ద నిరసన

Apr 5,2024 20:30 #Dharna, #gudivada, #Tidco Colony
  •  సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

ప్రజాశక్తి-గుడివాడ (కృష్ణా జిల్లా) : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ టిడ్కో కాలనీల వద్ద లబ్ధిదారులు నిరసన తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడ టిడ్కో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా Ûకమిటీ కార్యదర్శి బసవ అరుణ మాట్లాడుతూ.. 7400 మంది లబ్ధిదారుల బ్యాంకు రుణాలు వెంటనే మాఫీ చేయాలని, ప్రతి బ్లాక్‌ వద్ద బోర్‌వేసి ట్యాంక్‌కు కనెక్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ట్యాంకర్లతో నీరు అందిస్తే నాలుగో అంతస్తుల్లో నివసించే వృద్ధులు, గర్భిణులు చాలా అవస్థలు పడతారని తెలిపారు. కమిటీ సభ్యులు ఆర్‌. సంగమ్మ మాట్లాడుతూ. కాలనీలోని వారికి బ్యాంకు నోటీసులు వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఉపాధ్యక్షులు ఎం. దుర్గ మాట్లాడుతూ.. ఓట్ల కోసం వచ్చే పార్టీ నాయకులను రుణమాఫీ కోసం నిలదీయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శివరాం ప్రసాద్‌, పార్వతి, సుబ్రహ్మణ్యం, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

➡️