పీఎస్‌ఎల్‌వీ-సీ58 కౌంట్‌డౌన్‌ ప్రారంభం

Dec 31,2023 11:21 #ISRO, #pslv

ప్రజాశక్తి-సూళ్లూరుపేట: 2024 మొదటి రోజే పీఎస్‌ఎల్‌వీ-సీ58 ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక మనదేశానికి చెందిన ఎక్స్‌-రే పొలారిమీటర్‌ ఉపగ్రహం (ఎక్స్‌పోశాట్‌)ను అంతరిక్షంలోకి తీసుకువెళ్లనుంది. ఇందుకు సంబంధించి సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ (శ్రీహరికోట)లో కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ఆదివారం ఉదయం 8.10 గంటలకు ప్రారంభమైంది. ఈ ప్రక్రియ 25 గంటలపాటు కొనసాగి సోమవారం ఉదయం 9.10 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి58 వాహకనౌక షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇది ఎక్స్‌పోశాట్‌ను కక్ష్యలోకి వదిలిపెట్టిన తర్వాత పీఎస్‌4 10 ఇతర పేలోడ్‌లను హౌస్ట్‌ చేయనుంది.

➡️