యువతలో ఉత్సాహాన్ని నింపిన యువశక్తి సదస్సు

Feb 9,2024 15:31 #Seminar, #Visakha, #youths
pulsus ceo srinubabu seminar in visakha
  • గత 12 ఏళ్లలో ఏపీ నుండి 50 లక్షల మంది గ్రాడ్యుయేట్లు వలస వెళ్లారు
  •  పల్సస్ సీఈవో డా. గేదెల శ్రీనుబాబు

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : యువతకు చక్కటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వారికి ఉజ్వల భవిష్యత్తును అందించాలన్నదే లక్ష్యంగా పల్సస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన యువశక్తి సదస్సు విద్యార్ధుల నుండి భారి స్పందన లభించింది. శుక్రవారం ఉదయం విశాఖపట్నం సిరిపురంలోని గురుజాడ కళాక్షేత్రం వేదికగా నిర్వహించిన ఈ సదస్సులో ముఖ్య వక్త గా పాల్గొన్న పల్సస్ గ్రూప్ సీఈవో డా. గేదెల శ్రీనుబాబు మాట్లాడుతూ యువత ముందున్న సవాళ్లను పరిష్కరించడం, అలాగే పారిశ్రామిక పురోగతి, భవిష్యత్ ఉపాధి అవకాశాలను ప్రదర్శించడం ద్వారా విశాఖతోపాటు ఆంధ్రా యువతకు సాధికారత కల్పించడం లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు. డిజిటల్ యుగంలో నేటి యువత ముందుండాలని, అందుకోసం అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను నిరంతరం అభ్యసించాలని సూచించారు. అలాగే ఆర్థిక పురోగతిని ముందుకు తీసుకెళ్లడానికి కొత్త ఆవిష్కరణలెంతో కీలకమని, వాటిపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. వీటితోపాటు యువతలో నాయకత్వ లక్షణాలు పెరగాలన్నారు. అందుకోసం యంగ్ థింకర్స్ ఫోరమ్ లాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో 10,000 మంది ఇంజనీరింగ్ , వివిధ డిగ్రీ పట్టబద్రులు పాల్గొన్నారు. గత 12 సంవత్సరాలలో, ఆశ్చర్యపరిచే విధంగా 5 మిలియన్ల (50 లక్షల) డిగ్రీ పట్టబద్రులు ఉద్యోగ అవకాశాల కోసం ఆంధ్ర ప్రదేశ్ నుండి వలస పోయారు. ఆంధ్రప్రదేశ్లో నుండి 40 లక్షల మంది (4 మిలియన్లు) ఐటీ , సాఫ్ట్వేర్ నిపుణులు వస్తే, ఆంధ్రప్రదేశ్లో 40,000 కంటే తక్కువ మంది ఉన్నారని, ఈ దుస్థితికి కారణం రాజకీయనాయకులు అని పల్సస్ గ్రూప్ సీఈవో డాక్టర్ గేదెల శ్రీనుబాబు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 4 కోట్ల మంది ప్రజలను చేరుకోవాలనే లక్ష్యంతో రాబోయే 50 రోజుల్లో 10 యువశక్తి సదస్సులు, 10 రైతు సాధికారత సదస్సులను నిర్వహించే ప్రణాళికలను రచించామని, ఈ కార్యక్రమాలు యువత , రైతులకు సాధికారత కల్పించడానికి , రాబోయే 2024 సంబంధించిన ఎన్నికలలో సమాచారంతో కూడిన ఎంపికలు చేయడం గురించి వారికి అవగాహన దోహద పడతాయి అని చెప్పారు. అంతేకాకుండా మన రాష్ట్ర యువత సాధికారత కోసం ఆయన రూపొందించిన విజన్ వివరించారు. విశాఖ ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి ఈ స్ఫూర్తిదాయక సదస్సుకు చొరవ తీసుకుంటుందని అన్నరు. యువత సాధికారతతో ఆర్థిక అభివృద్ధి సాధ్యమని సదస్సులో ఆయన పిలుపునిచ్చారు. విశాఖ నగరం 100- బిలియన్ ఆర్థిక వ్యవస్థ దిశగా ప్రయాణాన్ని ప్రోత్సహించేందుకు తాను సిద్దంగా ఉన్నానని ఆంధ్రప్రదేశ్ ను ఆర్థిక వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఉన్న అవకాశాలను ఆయన వివరించారు. సదస్సుకు ఉత్తరాంధ్రలోని పలు ఇంజనీరింగ్, ఇతర కళాశాలల నుంచి 10,000 మందికి పైగా విద్యార్థులు, పెద్ద సంఖ్యలో యువత హాజరై డా. శ్రీనుబాబు ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకించారు.

➡️