తిరుపతి డిఎస్‌పిగా బాధ్యతలు చేపట్టిన రవి మనోహర ఆచారి

ప్రజాశక్తి -తిరుపతి సిటీ :తిరుపతి డిఎస్‌పిగా కె. రవి మనోహర ఆచారి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఎసిబి డిఎస్‌పిగా విధులు నిర్వహిస్తున్న ఆయన ఎన్నికల పోలింగ్‌ రోజు, ఆ మరుసటి రోజు తిరుపతి, చంద్రగిరిలో జరిగిన ఘర్షణలపై విచారణ చేపట్టిన సిట్‌ బృందానికి నాయకత్వం వహించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తిరుపతిలో శాంతి భద్రతలను కాపాడడంలో తన వంతు కృషి చేస్తానని, గంగమ్మ జాతర, త్వరలో జరగబోయే ఎన్నికల కౌంటింగ్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటానన్నారు. గతంలో ఆయన తిరుపతి ఈస్ట్‌ సిఐగా పనిచేశారు.

➡️