మెట్టుగూడలో రెడీమిక్స్‌ లారీ బీభత్సం

Feb 4,2024 13:15 #Mettuguda, #Readymix lorry

మెట్టుగూడ (హైదరాబాద్‌) : మెట్టుగూడ లో లారీ బీభత్సం సృష్టించింది. మెట్టుగూడజాతీయ రహదారిపై ఆదివారం వేకువ జామున ఉదయం 5:25 నిమిషాల సమయంలో ఒక్కసారిగా శబ్దం రావడంతో మెట్టుగూడా పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మెట్టుగూడ మెయిన్‌ రోడ్‌ రైల్వే ఆఫీసర్స్‌ క్లబ్‌ వద్ద నాచారం ప్లాంట్‌ నుంచి హైటెక్‌ సిటీ కన్‌స్ట్రక్షన్‌ సైట్‌ కి లోడుతో వెళుతున్న రెడీమిక్స్‌ లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. దీంతో డ్రైవర్‌ లారీని వదిలేసి పారిపోయాడు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న చిలకలగూడ ట్రాఫిక్‌ ఎస్‌ఐ శ్రీధర్‌ శేఖర్‌, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

➡️