కువైట్ అగ్ని ప్రమాదంలో ఏపీ వాసులు మృతి

ప్రజాశక్తి-పెరవలి మండలం (తూర్పుగోదావరి జిల్లా) : కువైట్ అగ్ని ప్రమాదంలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ చెందిన వారు మృతి చెందారు. భారతీయ కార్మికులు నివాసముండే బహుళ అంతస్థ భవనంలో భారీ అగ్ని ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలోని అన్నవరప్పాడు ఖండవల్లి గ్రామాలకు చెందిన ఇరువురు వ్యక్తులు ఇటీవల కువైట్ దేశంలో బహుళ అంతస్థ భవనంలో బుధవారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకబద్ర గ్రామంకు చెందిన తామాడ లోకనాదం కూడా మృతి చెందినట్లు ఆలస్యంగా తెలిసింది. దీంతో మొత్తం ముగ్గురు ఆంధ్రులు మృతి చెందినట్లు అధికారులు దృవీకరించారు. బ్రతుకు దెరువు కోసం పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ కంట్రీ కువైట్ దేశం వెళ్లిన వారి మృతదేహాలు ఈ సాయంత్రం కేరళ విమానాశ్రయానికి చేరుకోనున్నాయి.

పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం ఖండవల్లి గ్రామానికి చెందిన మొల్లేటి ముక్తేశ్వరరావు భార్య రాఘవులు గ్రామంలో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. 2వ కుమారుడు మొల్లేటి సత్యనారాయణ వయసు(38) ఇతనికి సుమారు 20 సంవత్సరాలు క్రితం అనంతలక్ష్మితో వివాహం అయినది వీరికి వెంకట సాయి వయసు(19) కుమారుడు ఉన్నాడు. ఇతను ఉపాధి నిమిత్తం 12 సంవత్సరాల క్రితం కువైట్ దేశం వెళ్లి ఒక సూపర్ మార్కెట్ లో హెల్పర్ పనిచేస్తు అక్కడ వచ్చే జీతంతో కుటుంబాన్ని పోషించుకుంటూ 2 లేక 3 సంవత్సరాల ఇండియాకు వస్తున్నాడు. ఈ మధ్యకాలంలో గ్రామంలో సొంత ఇల్లు నిర్మాణం చేస్తే గృహప్రవేశంనకు వచ్చి వెళ్ళాడు. బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో అగ్నికీలలకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరుగా విలపిస్తున్నారు.
పదేళ్ల క్రితం అన్నవరప్పాడు గ్రామానికి చెందిన నారాయణరావు సీతామాలక్ష్మి దంపతుల కుమారుడు మీసాల ఈశ్వరుడు వయసు(40) ఇతను కూడా అగ్ని ప్రమాదంలో చనిపోయారు. ఇతను పెద్దగా చదువుకోలేదు. వ్యవసాయ కూలీ పనులు చేస్తూ 10 సంవత్సరాల క్రితం కువైట్ దేశం వెళ్లారు. అప్పటి నుండి అక్కడ సూపర్ మార్కెట్లో చేస్తున్నారు. తన భార్య చిట్టి కాసులు, కుమారుడు సాయి మణికంఠ, కుమార్తె కోమలి కృష్ణ కుమారి. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది.

➡️