సంక్రాంతి కర్ఫ్యూ

Jan 16,2024 11:46 #road, #Sankranti festival
roads in visakha

బోసిపోయిన ప్రధాన కూడళ్ళు 

ప్రజాశక్తి – యంత్రాంగం : సంక్రాంతి పండగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పట్టణాలలోని రోడ్లు, ప్రధాన జంక్షన్ లు కర్ఫ్యూ విధించినట్లు  బోసిపోయాయి. విజయనగరంలో ప్రధాన జంక్షన్ లు గంటస్టంబం, మూడు లాంతర్లు, ఎంజీ రోడ్డు, బాలాజీ జంక్షన్, ఎత్తుబ్రిడ్జి, అర్ అండ్ బి జంక్షన్, కలెక్టరేట్ జంక్షన్ లు, విశాఖలోని ఆర్టీసీ కాంప్లెక్స్, రామ టాక్స్, సిబిఐ డౌన్ వాహనాలు రాకపోకలు, ప్రజలు ఎవ్వరూ లేకపోవడంతో నిర్మానుష్యంగా మారాయి. మరో వైపు నగరంలో ఉద్యోగులు, ప్రజలు గ్రామాలు తరలిపోవడంతో వీధులు కూడా బోసిపోయాయి. భోగి రోజు వరకు కిటకిటలాడిన పట్టణాలు ఆదివారం సోమవారం నాడు జనాలు లేక వెల వెల బోయింది. మరో వైపు సోమవారం నుంచి షాపులు తెరవకపోవడంతో నగరాలు పూర్తిగా నిర్మానుష్యంగా మారింది.

roads in visakha

➡️