రూ.7.30 లక్షల నగదు సీజ్‌

Apr 11,2024 00:17 #2024 elections, #money sized

ప్రజాశక్తి-యంత్రాంగం : ఎన్నికల నేపథ్యంలో పోలీసులు బుధవారం పలుచోట్ల చేపట్టిన వాహన తనిఖీల్లో రూ.7.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపకపోవడంతో పట్టుబడిన నగదును సీజ్‌ చేశారు. విశాఖ ఎంవిపి కాలనీ సర్కిల్‌ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా వైసిపి రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ప్రయివేటు కార్యదర్శి జి.దశరధరామిరెడ్డి కారులో రూ.6 లక్షల నగదును గుర్తించారు. ఇంటి కొనుగోలు నిమిత్తం తీసుకెళ్తున్నానని దశరధ రామిరెడ్డి అధికారులకు వివరించారు. అందుకు తగిన ఆధారాలు చూపకపోవడంతో నగదును సీజ్‌ చేశారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలోని అల్లిపల్లి చెక్‌పోస్ట్‌ వద్ద ఎస్‌ఎస్‌టి బృందం తనిఖీలు చేస్తుండగా ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.1.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

➡️