వీధి నాటిక వైతాళికుడు సఫ్దర్‌ హష్మీ

Jan 3,2024 10:46 #Arts, #Profiles
safdar hashmi

 

35వ వర్ధంతి సందర్భంగా నివాళి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జన జాగృతికి జీవితాన్నే అర్పించిన వీధి నాటిక వైతాళికుడు సఫ్దర్‌ హష్మీ చిరస్మరణీయుడని ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు గాదె సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యాలయంలో హష్మీ 35వ వర్థంతి సభ జరిగింది. ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ అనిల్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన సభలో హష్మీకి నివాళులర్పించారు. రాష్ట్ర, జిల్లాల నాయకులు ఎస్‌కె ఖాసీం, జివి రంగారెడ్డి, పి అప్పన్న, ఎ జగన్‌, డి శ్రీనివాస్‌ తదితరులు ప్రసంగించారు. ప్రజా చైతన్యానికి వీధి నాటికను అత్యంత శక్తిమంతంగా వినియోగించిన గొప్ప కళాకారుడు, జననాట్య మండలి వ్యవస్థాపక నాయకుడు సఫ్దర్‌ హష్మీ అని అన్నారు. ప్రజలకు వాస్తవాల్ని కళ్లకు కట్టేలా ‘హల్లాబోల్‌’ అనే వీధి నాటికను జనరంజకంగా ప్రదర్శిస్తున్న సందర్భంగా దేశ రాజధానిలో సంఘ విద్రోహశక్తులు మారణాయుధాలతో చేసిన దాడిలో హష్మీ సహా ఇద్దరు కళాకారులు అమరులైన సంఘటనను వక్తలు గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు షార్ట్‌ ఫిల్మ్‌ అసోసియేషన్‌ ప్రధాన క్యారదర్శి డివి రాజు, కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

➡️