వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురి మృతి

Nov 24,2023 19:02 #road accident

తిరుపతి: ఏపీలోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి.తిరుపతి జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నారాయణవనం మండలం సముదాయం వద్ద కళాశాల బస్సు, కారు డీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. బస్సులోని పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.నెల్లూరు జిల్లా కావలి మండలం మద్దూరుపాడు వద్ద జాతీయ రహదారిపై ఆగివున్న లారీని కారు డీ కొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారికి కావలి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కారు తిరుపతి నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మఅతుల్లో ఇద్దరు విజయవాడ భవానీపురం వాసులుగా గుర్తించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️