న్యాయం చేయాలని పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ భార్య ఆందోళన..

May 22,2024 12:01 #dhrna, #police wife, #Telangana

హైదరాబాద్‌ : న్యాయం చేయాలని సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి పోలీస్‌ స్టేషన్‌ ముందు ఎస్‌ఐ భార్య నిన్న రాత్రి నుంచి ఆందోళన చేపట్టారు. కొమురవెళ్లి ఎస్‌ఐ నాగరాజు రెండేళ్లుగా తనతో కాపురం చేయడం లేదని భార్య మానస ఆరోపించారు. వేరోక మహిళను పెళ్లి చేసుకున్నందుకే తనను దూరం పెట్టాడని ఆరోపిస్తున్నారు. రెండు నెలల నుంచి ఇద్దరి పిల్లల్ని నేను చనిపోయినట్టు చెప్పి దూరం పెట్టారన్నారు. తనకు తమ ఇద్దరు పిల్లలకు ఎస్‌ఐ నాగరాజు, రెండో భార్యతో ప్రాణహాని ఉందని వాపోయింది. తనకి న్యాయం చేసి తన ఇద్దరి పిల్లల్ని తనకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సీఐ శ్రీనును సంప్రదించగా.. విషయాన్ని మానస ఇటీవల తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. కౌన్సెలింగ్‌ ఇచ్చామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

➡️