‘ఉక్కు’ దీక్షలకు పెన్షనర్ల మద్దతు

Dec 17,2023 20:32 #Protest, #visakha steel
steel plant protest

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన దీక్షలకు పెన్షనర్లు మద్దతు తెలిపారు. పెన్సనర్స్‌ డే సందర్భంగా ఆదివారం వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌, సెయిల్‌, బిహెచ్‌పివి, హెచ్‌ఎస్‌ఎల్‌, డబ్ల్యుఎస్‌ఎల్‌ వంటి ప్రభుత్వ సంస్థలలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన కార్మికులంతా దీక్షా శిబిరానికి తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా స్టీల్‌ప్లాంట్‌ రిటైర్డ్‌ ఉద్యోగి దీనబంధు మాట్లాడుతూ.. పెన్షనర్లు విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని బలంగా ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. ఉక్కు పోరాటానికి అన్ని విధాలా సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 1039వ రోజు దీక్షలో పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, వరసాల శ్రీనివాసరావు, దొమ్మేటి అప్పారావు, శ్రీనివాసనాయుడు పాల్గన్నారు.

➡️