Polavaram నిర్వాసితుల సమస్యలపైనా పోరాటాలు

  • రైతుకూలీ సంఘం రాష్ట్ర మహాసభ నిర్ణయం

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ : రానున్న కాలంలో రైతాంగ, రైతు కార్మికుల సమస్యలతో పాటు పోలవరం నిర్వాసితుల సమస్యలపైనా పోరాటాలు నిర్వహించనున్నట్లు రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ తెలిపారు. మూడ్రోజులపాటు ఏలూరులోని టుబాకో మర్చంట్స్‌ అసోసియేషన్‌ హాలులో జరిగిన రైతుకూలీ సంఘం రాష్ట్ర మహాసభ సోమవారం ముగిసింది. చివరి రోజు అధ్యక్షులుగా సింహాద్రి ఝాన్సీ, కార్యదర్శిగా డి వర్మతోపాటు 24 మందితో నూతన రాష్ట్ర కమిటీ ఎన్నికైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఝాన్సీ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస సమస్యలను పరిష్కరించాలని, కనీస మద్దతు ధర చట్టం చేయాలని, పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని, అటవీ సంరక్షణ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వెనక్కు తీసుకోవాలని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను నెలకొల్పి, గ్రామీణ వలసలు అరికట్టాలని, రైలుప్రమాద ఘటనలకు ప్రభుత్వాల ప్రయివేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా, ఇతర ప్రజా సమస్యలపై 20 తీర్మానాలను మహాసభలో ఆమోదించినట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్మ, జిల్లా కార్యదర్శి భాషా పాల్గొన్నారు.

➡️