పరీక్షకు ప్రిపేర్‌ అవుతూ గుండెపోటు – విద్యార్థిని మృతి

Mar 19,2024 11:40 #died, #heart attack, #Kadapa, #student

కడప : ఎపిలో 10వ తరగతి పరీక్షలు జరుగుతోన్న నేపథ్యంలో … విషాదం జరిగింది. కడప జిల్లా రాజుపాలెం మండలం కొర్రపాడు గ్రామంలోని పాఠశాలలో పదో తరగతి పరీక్షకు ప్రిపేర్‌ అవుతున్న లిఖిత అనే విద్యార్థిని అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే విద్యార్థినిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే విద్యార్థి చనిపోయినట్లు డాక్టర్లు నిర్థారించారు. విద్యార్థి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️