భావితరాలకు సుందరయ్య మార్గదర్శి

  • మతోన్మాదంతో నియంతృత్వ ముప్పు : శ్రీనివాసరావు
  •  ‘మతోన్మాదం- రాజ్యాంగం- సవాళ్లు’పై స్మారకోపన్యాసం

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : కమ్యూనిస్టు యోధులు పుచ్చలపల్లి సుందరయ్య భావితరాలకు మార్గదర్శి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి, సామాజిక న్యాయానికి, స్వావలంబనకు, ఫెడరలిజానికి విఘాతం కలిగిస్తూ దేశంలో ప్రధాని మోడీ పదేళ్లుగా పాలన సాగిస్తున్నారని వివరించారు. ఈ క్రమంలో నేటి యువతరానికి సుందరయ్య జీవిత ఆదర్శాలు, ఆయన చేసిన రచనలు ఎంతో అవసరమని చెప్పారు. సుందరయ్యకు నిజమైన నివాళి అంటే రాజ్యాంగ హక్కుల రక్షణ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు పాటుపడడమేనన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్థంతి సభ విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన వి.శ్రీనివాసరావు… ‘మతోన్మాదం – రాజ్యాంగం – ప్రస్తుత సవాళ్లు’ అనే అంశంపై స్మారకోపన్యాసం చేశారు. పాతాళానికి తొక్కినా తిరిగి ఆకాశానికి ఎగరగలిగిన శక్తి కమ్యూనిజానికి ఉందన్నారు. కారల్‌ మార్క్స్‌ కమ్యూనిస్టు ప్రణాళికను రాసినప్పుడు ప్రపంచాన్ని కమ్యూనిజం భూతం ఆవహించిందంటూ అమెరికా వ్యంగ్యంగా మాట్లాడిందని గుర్తు చేశారు. వాస్తవానికి అమెరికాకు ఇప్పుడు కమ్యూనిజం భయం అలముకుందన్నారు. అమెరికా తన శత్రువుగా చైనాను నేటికీ చెబుతోందని, అమెరికాకు పెద్ద సవాలుగా కమ్యూనిజం ఉందని తెలిపారు. భారత ప్రధాని మోడీ ఎక్కడ పర్యటించినా చైనాను తిట్టకుండా ఉండడం లేదన్నారు. ప్రపంచ వ్యాపారంలో చైనా అగ్రగామిగా ఉందని గుర్తు చేశారు. మన దేశ పాలకులకు చైనాతో వేల కోట్ల వ్యాపారం కావాలిగానీ, ఆ దేశ కమ్యూనిజం వద్దని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 1920-29 మధ్య భారత్‌లో కమ్యూనిజాన్ని బ్రిటిష్‌ వారు అణచివేయాలని చూసినా సాధ్యం కాలేదన్నారు. ఆ కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు భావజాలం మరింత ఉధృతంగా ముందుకొచ్చిందని తెలిపారు. ప్రస్తుతం మన దేశ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి మతోన్మాదంతో ప్రమాదం దాపురించిందని శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రజలు మత స్వేచ్ఛను కోల్పోతున్నారని తెలిపారు. మతోన్మాదంతో నియంతృత్వ ప్రమాదం పొంచి ఉందన్నారు. ఒక్కో రాష్ట్రంలో మిగతా 2లో

➡️