మీరు నాతో తోలుబొమ్మలాట ఆడుకున్నారు.. జగన్‌పై సునీత ఆగ్రహం

Apr 2,2024 12:15 #ap cm jagan, #coments, #ys sunitha

ప్రజాశక్తి-అమరావతి : వివేకా హత్య జరిగిన తర్వాత మీరు నాతో తోలుబొమ్మలాట ఆడుకున్నారనివైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో అవినాశ్‌ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ… ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై ఈరోజు విచారణ జరగనుంది. ఈ సందర్భంగా సునీత మాట్లాడారు. గతంతో మిమ్మల్ని గుడ్డిగా నమ్మానని… మీరు చెప్పినట్టు చేశానని తెలిపారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని.. వాస్తవాలన్నీ ప్రజలకు తెలుసని చెప్పారు. ఎవరైనా ఒకసారి మోసం చేయొచ్చు.. పదేపదే మోసం చేయలేరని అన్నారు. వివేకా హత్య గురించి ఒక అన్నగా తనకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదని… సీఎంగానైనా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగనన్న పార్టీకి ఓటు వేయొద్దని, ఎన్నికల్లో వైసీపీ గెలవకూడదని అన్నారు. తన తండ్రిని హత్య చేసిన వారికి, చేయించిన వారికి శిక్ష పడాలని చెప్పారు. మన ధైర్యాన్ని ఓటు ద్వారా చూపిద్దామని… వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుదామన్నారు.

➡️