తూర్పుగోదావరిలో 23 మంది వాలంటీర్ల సస్పెన్షన్‌

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం: ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించని 45 మంది వాలంటీర్లను అధికారులు బుధవారం విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. నేడు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో 23 మంది వాలంటీర్లను సస్పెండ్‌ చేస్తూ రిటర్నింగ్‌ అధికారి ఆదేశాలు జారీ చేశారు. వైసిపి అనుకూలంగా పని చేస్తున్నారని ఇటీవల వారిపై టిడిపి నాయకులు ఫిర్యాదు చేయడంతో ఈ ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

➡️