ఐపిఎస్‌ అధికారి అంజనీకుమార్‌ పై సస్పెన్షన్‌ ఎత్తివేత

హైదరాబాద్‌ : తెలంగాణకు చెందిన ఐపిఎస్‌ అధికారి అంజనీకుమార్‌ పై విధించిన సస్పెన్షన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన సమయంలో … రాష్ట్ర డిజిపిగా అంజనీకుమార్‌ విధుల్లో ఉన్నారు. ఫలితాలు వెలువడుతున్న సమయంలో ఆయన రేవంత్‌ రెడ్డిని వెళ్లి కలిశారు. ఈ నేపథ్యంలో … ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ … అంజనీకుమార్‌ను ఈసీ సస్పెండ్‌ చేసింది. అయితే తాను ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించలేదని… అంజనీకుమార్‌ ఈసీకి వివరణ ఇచ్చారు. ఎన్నికల ఫలితాల రోజు రేవంత్‌ రెడ్డి పిలిస్తేనే వెళ్లానని.. మరోసారి ఇలా జరగదని అంజనీకుమార్‌ హామీ ఇచ్చారు. దీంతో ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ.. సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ తెలిపింది.

➡️