తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌పై సస్పెన్షన్ వేటు

Dec 3,2023 20:06 #DGP, #Telangana
  • ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెల్లడికాకముందే రేవంత్‌ రెడ్డిని కలవడంపై ఈసీ ఆగ్రహం

హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికలు వెలువడుతున్న నేపథ్యంలో ఈసీ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న తరుణంలో టీపీసీసీ రేవంత్‌ రెడ్డిని కలవడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పీటీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఈసీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందుకు గానూ ఈ షాకింగ్‌ నిర్ణయాన్ని ఈసీ తీసుకుంది. మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఈసీ నోటీసులు జారీ చేసింది. అదనపు డీజీలు మహేష్ భగవత్, సంజయ్ జైన్‌లకు నోటీసులు పంపింది. వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

➡️