స్కూల్‌ నుంచి విద్యార్థిని కిడ్నాప్‌, తాళికట్టి అత్యాచారం..

Nov 23,2023 11:36 #West Godavari District

ప్రజాశక్తి-పశ్చిమగోదావరి : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే కామాంధుడిగా మారిపోయాడు.. 15 ఏళ్ల చిన్నారిపై కన్నేశాడు.. విద్యార్థినికి మాయమాటలు చెప్పి స్కూల్‌ నుంచి తీసుకెళ్లాడు.. తాళికట్టి.. ఇక, మనకు పెళ్లి అయిపోయింది.. అంటూ ఆ తర్వాత అత్యాచారానికి తెగబడ్డాడు.. ఆ విద్యార్థిని జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పంది.. ఆ తర్వాత వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భీమవరం గ్రామీణ మండలం తాడేరు గ్రామానికి చెందిన పురెళ్ల సోమరాజు జిల్లాలోని మరో మండలంలోని ఒక పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.. 15 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటున్నానని మాయమాటలు చెప్పి స్కూల్‌ నుంచి ఈ నెల 19వ తేదీన విద్యార్థినిని తన బైక్‌పై ఎక్కించుకొని తన స్వగ్రామం తాడేరుకు తీసుకెళ్లాడు.. అక్కడే ఆ బాలికకు తాళికట్టి పెళ్లి అయిపోయిందని చెప్పి.. ఆపై ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఊహించని ఘటనతో షాక్‌తిన్న విద్యార్థిని తొలుత జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమరాజుపై అత్యాచారం, ఫోక్సో, బాల్య వివాహ నిరోధక చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కోసం దిశ డీఎస్పీ ఎన్‌. మురళీకృష్ణను నియమిస్తూ ఎస్పీ రవిప్రకాశ్‌ ఆదేశాలు జారీ చేశారని ఆకివీడు సీఐ కె సత్యనారాయణ వివరించారు.

➡️