తిరుమలకు చేరుకున్న తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి

May 21,2024 22:35 #CM Revanth Reddy, #tirupathi

– టిటిడి అధికారులు ఘన స్వాగతం
ప్రజాశక్తి -తిరుమల :శ్రీవారి దర్శనార్థం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. మంగళవారం రాత్రి పద్మావతి నగర్‌లోని అతిథి గఅహం వద్దకు చేరుకున్న రేవంత్‌రెడ్డి దంపతులకు టిటిడి ఇఒ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. రాత్రికి తిరుమలలో రేవంత్‌ రెడ్డి బస చేశారు. తన మనవడికి పుట్టు వెంట్రుకలు స్వామివారికి సమర్పించనున్నారు. బుధవారం ఉదయం విఐపి బ్రేక్‌ దర్శనంలో రేవంత్‌రెడ్డి దంపతులు స్వామి వారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం కానున్నారు.

➡️