తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా..

Feb 12,2024 16:36 #Assembly, #Telangana

హైదరాబాద్‌ : తెలంగాణ శాసనసభ సమావేశాలు వాయిదా పడ్డాయి. సోమవారం కృష్ణా జలాల వాటాపై సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడివేడీ చర్చ జరిగింది. అనంతరం స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుమందు సాగునీటి ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించొద్దని సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రవేశ పెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. ఈ విషయాన్ని స్వయంగా సభలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ప్రకటించారు. మరోవైపు ఇంత కీలకమైన సమావేశాలకు మాజీ సిఎం విపక్ష నేత కెసిఆర్‌ హాజరుకాకపోవడాన్ని సిఎం రేవంత్‌రెడ్డి తప్పుపట్టారు. చేసిన నిర్వాకమంతా చేసి ఇప్పుడు సమావేశాలకు కేసీఆర్‌ ఎందుకు రావడం లేదని సీఎం ప్రశ్నించారు. కృష్ణానది జలాల విషయంలో ముమ్మాటికీ తెలంగాణకు అన్యాయం చేసింది గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వమేని సీఎం రేవంత్‌ రెడ్డి సహా, కాంగ్రెస్‌ మంత్రులంతా విమర్శించారు.

➡️