నాగార్జున సాగర్‌ వద్ద ఉద్రిక్తత.. సీపీఐ నారాయణ సీరియస్‌ కామెంట్స్‌

Nov 30,2023 10:42 #cpi narayana, #Nagarjuna Sagar

ప్రజాశక్తి -అమరావతి : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ వేళ నాగార్జునసాగర్‌ డ్యాం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్దకు రెండు రాష్ట్రాల పోలీసులు భారీగా చేరుకున్నారు. తాజాగా.. ఈ అంశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. తెలుగు ప్రజలకు అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఇటు ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్‌ ద్రోహం చేసేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వీళ్లతో పాటు బీజేపీ కూడా కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ ముగ్గరూ కలిసి పోలింగ్‌ వేళ రాజకీయ లబ్ధిపొందేలా నాగార్జున సాగర్‌ వద్ద అర్ధరాత్రి హంగామా సృష్టించారని మండిపడ్డారు. నీటి వివాదం కొత్తది కాదని.. కానీ, రాజకీయ లబ్ధి కోసమే పోలింగ్‌కు ముందు రోజు వివాదం క్రియేట్‌ చేశారని అన్నారు. కేవలం ఇది తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టే కుట్రే అని తేల్చి చెప్పారు. రాజకీయ కుట్రలను తెలుగు ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు.

➡️