వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత..

Feb 6,2024 15:13 #Dharna, #sarpanches

ప్రజాశక్తి-ఉయ్యూరు(కృష్ణా) : పంచాయతీల నిధులను ప్రభుత్వం స్వాహా చేసిందని ఆరోపిస్తూ.. ఏపీ సర్పంచ్‌లు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. అసెంబ్లీని ముట్టడిస్తామని సర్పంచ్‌లు ముందుగానే ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు చోట్ల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర ఆధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్రప్రసాద్‌ అమరావతి ”ఛలో అసెంబ్లీ” ముట్టడికి అనుమతి లేదని పోలీసులు ఉయ్యూరులో హౌస్‌ అరెస్టు చేశారు. ఉయ్యూరు టౌన్‌, రూరల్‌ పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ప్రసాద్‌ బయటకు వెళ్లకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇంటి వద్ద కూర్చొని ప్రభుత్వ వైఖరిపై రాజేంద్ర నిరసన తెలిపారు. ఈ క్రమంలో వైవీబీ అనుచరులు టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు.

 

➡️